ముఖ తేజస్సు పెరగాలంటే...
పది గులాబీ రేక్కలను నీళ్లలో గంటపాటు నానబెట్టి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, మూడు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పావు గంట ప్రిజ్ లో ఉంచాక వేళ్లతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.